ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో డిమాండ్ ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి రైతులను ఆదుకోవాలని సీఎం జగన్‌ను కోరారు. రాష్ట్ర సరిహద్దులు మూసివేయడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి ట్విట్టర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే, స్వయం సహాయక సంఘాల రుణాల చెల్లింపును జూన్ వరకూ వాయిదా వేసి ఆ సభ్యుల ఆవేదనను తగ్గించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జనసేన పార్టీ.. ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.
అలాగే.. ఈ క్లిష్ట తరుణంలో కేసీఆర్ నేతృత్వంలో సమర్థవంతంగా పని చేస్తున్నారని.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఇక కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర తరుణంలో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేలా ఈ ప్యాకేజీ ఉందన్నారు. అలాగే ఇదే సమయంలో ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా నెలవారీ ఈఎమ్‌ఐ చెల్లింపులను జూన్ వరకూ వాయిదా వేయడాన్ని పరిశీలించాలని సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు పవన్.
An appeal to YCP led AP Govt
——————————————
With markets and borders closed, mango farmers fear huge losses. I appeal to the Govt to take necessary measures ahead. To reduce the distress among the women, help if SHG loan payments can be deferred until June.— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
Also to reduce the burden on working class and self employed, I request to look into the possibility of deferring the EMI payments till June. Jai Hind
— Pawan Kalyan (@PawanKalyan) March 26, 2020
ఇవి కూడా చదవండి:
వైరల్ న్యూస్: కరోనా ఉంది నాన్నా.. బయటకెళ్లొద్దంటూ.. బుడ్డోడి ఆవేదన
ఇది పచ్చి అబద్ధం.. ఈ సమయంలోనూ నాపై రూమర్లు ప్రచారం చేయడం దారుణం
ఏప్రిల్ 15 తరువాత కూడా లాక్‌డౌన్ కంటిన్యూ?
కరోనా ఎఫెక్ట్: కమల్ హాసన్ ఉదార భావం.. తన ఇంటినే హాస్పిటల్‌గా మార్చేస్తారట
కరోనా వైరస్ తొందరగా వ్యాపించే ప్రదేశాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి!
కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం