పాట్నా.. ‘ఎయిమ్స్’ లో ఇక హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 12:25 PM

కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ కోసం పాట్నాలోని 'ఎయిమ్స్' యాజమాన్యం నడుం బిగించింది. ఇందుకు 18 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. చాలామంది తమను సెలక్ట్ చేయాలని కోరుతూ ముందుకు..

పాట్నా.. ఎయిమ్స్ లో ఇక హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభం
Follow us on

కరోనా వైరస్ చికిత్సలో ఉపయోగపడే వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ కోసం పాట్నాలోని ‘ఎయిమ్స్’ యాజమాన్యం నడుం బిగించింది. ఇందుకు 18 మంది వలంటీర్లను ఎంపిక చేసింది. చాలామంది తమను సెలక్ట్ చేయాలని కోరుతూ ముందుకు వచ్చారని, కానీ 18-55 ఏళ్ళ మధ్య వయసున్న ఈ 18 మందిని ఎంపిక చేశామని ఈ ఆసుపత్రి  మేనేజ్ మెంట్ వెల్లడించింది. వీరికి సోమవారం నుంచి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వారి మెడికల్ రిపోర్టులను పరిశీలించిన అనంతరం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ ప్రకారం.. వారికి మొదటి డోసు వ్యాక్సీన్ ఇస్తారని తెలిసింది. ఆ తరువాత ఆ వ్యక్తి డాక్టర్ల పర్యవేక్షణలో సుమారు మూడు గంటల పాటు ఉంటాడు. ట్రయల్ ప్రాసెస్ పూర్తి కావడానికి మొత్తం మూడు డోసుల వ్యాక్సీన్ ఇస్తారు. కరోనా వైరస్ వ్యాక్సీన్ ట్రయల్ నిర్వహణకు ఐసీఎంఆర్ సెలెక్ట్ చేసిన 12 సంస్థల్లో ఈ ఎయిమ్స్ కూడా ఉంది.