ఢిల్లీ-లూథియానా విమానంలో ఒకరికి కరోనా పాజిటివ్

| Edited By: Pardhasaradhi Peri

May 27, 2020 | 7:10 PM

విమాన ప్రయాణికులకు సమగ్ర కరోనా స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయని, తమకు కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాన్ని వారు  నింపి ఇవ్వాలని, పైగా ఆరోగ్య సేతు యాప్ లో సదరు ప్రయాణికులకు  అసలు ఆ పాజిటివ్ లక్షణాలు లేవని తేలితేనే విమానం ఎక్కేందుకు..

ఢిల్లీ-లూథియానా విమానంలో ఒకరికి కరోనా పాజిటివ్
Follow us on

విమాన ప్రయాణికులకు సమగ్ర కరోనా స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయని, తమకు కరోనా లేదనే ధ్రువీకరణ పత్రాన్ని వారు  నింపి ఇవ్వాలని, పైగా ఆరోగ్య సేతు యాప్ లో సదరు ప్రయాణికులకు  అసలు ఆ పాజిటివ్ లక్షణాలు లేవని తేలితేనే విమానం ఎక్కేందుకు అనుమతిస్తామని పౌర విమానయాన శాఖ, ఎయిర్ లైన్స్ వర్గాలు తమ మార్గదర్శక సూత్రాల్లో పదేపదే పేర్కొన్నాయి. . కానీ అవి బూటకంగా కనిపిస్తున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగా నిన్న ఢిల్లీ-లూథియానా ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు తేలింది. దీంతో  పంజాబ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం..36 మంది ప్రయాణికులను, నలుగురు విమాన సిబ్బందిని క్వారంటైన్ కి తరలించారు. అలయెన్స్ ఎయిర్ సంస్థలో సెక్యూరిటీ విభాగంలో పని చేసే ఈ వ్యక్తి.. పెయిడ్ టికెట్ పై ప్రయాణిస్తున్నాడట. అలాగే ఈ నెల 25 న చెన్నై నుంచి కోయంబత్తూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో కూడా ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలియడంతో ఆ ఎయిర్ లైన్స్ సంస్థ మొత్తం సిబ్బందినంతటినీ 14 రోజుల క్వారంటైన్ కి షిఫ్ట్ చేసింది. ఆ ప్యాసింజర్ తనకు తాను కోయంబత్తూరులోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో ప్రత్యేక క్వారంటైన్ వార్డులో చేరాడట. ఇలా విమాన ప్రయాణికుల్లోనూ కరోనా సోకిన వ్యక్తులు బయటపడడంతో ఎయిర్ లైన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.