
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ సర్పంచులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్‌ను ప్రధాని అవిష్కరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన బాధ్యత గ్రామ పంచాయితీలదేని ఆయనీ సందర్భంగా చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు. మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారులు, విద్యుత్ సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయితీ ప్రతినిధులతో ప్రధాని మాట్లాడుతున్నారు.