పాకిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా.. 2.37 లక్షల పాజిటివ్ కేసులు..

| Edited By:

Jul 08, 2020 | 7:31 PM

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం..

పాకిస్థాన్‌లో విజృంభిస్తున్న కరోనా.. 2.37 లక్షల పాజిటివ్ కేసులు..
Follow us on

పాకిస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 2,980 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,37,489కి చేరింది. వీటిలో పంజాబ్‌ నుంచి 83,559 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. సింధ్ ప్రాంతం నుంచి 97,626, కైబర్ ప్రావిన్స్ ప్రాంతంలో 26,681, బలూచిస్థాన్‌లో 10,919, ఇస్లామాబాద్‌లో 1,595, గిల్గిట్‌ బల్టిస్థాన్‌లో 1,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 83 మంది మరణించారు. ఇప్పటి
వరకు కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 4,922 మంది మరణించారు.