Oxygen Shortage: ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత తీవ్రతరం.. ఆక్సిజన్‌ లేక డాక్టర్‌‌తో సహా, ఎనిమిది మంది మృతి

దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్‌ కొరత తీవ్రం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులు ఆక్సిజన్‌ సప్లయ్‌ లేక అల్లాడి పోతున్నాయి.

Oxygen Shortage: ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత తీవ్రతరం.. ఆక్సిజన్‌ లేక డాక్టర్‌‌తో సహా, ఎనిమిది మంది మృతి
Lack Of Oxygen In Delhi’s Batra Hospital
Follow us
Balaraju Goud

|

Updated on: May 01, 2021 | 4:32 PM

8 dead lack of Oxygen: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్‌ కొరత తీవ్రం వేధిస్తోంది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రులు ఆక్సిజన్‌ సప్లయ్‌ లేక అల్లాడి పోతున్నాయి. తాజాగా డిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ లేకపోవడంతో ఓ వైద్యుడితో సహా ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్‌లో ఆక్సిన్ లేక 8 మంది బాధితులు ప్రాణాలను కోల్పోయారు. మరణించిన వారిలోఅదే ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్ కూడా ఉన్నారు. ఈ 8 మంది ఐసీయూలో ఉన్నారు. తమ వద్ద తగినంత ఆక్సిజన్ లేదనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి చెప్పినా.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది హాస్పిటల్ మేనేజ్‌మెంట్. దేశ రాజధానిలో ఆక్సిజన్ సంక్షోభంపై వరుసగా 11వ రోజు ఢిల్లీ హైకోర్టుకులో విచారణ జరిగింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్‌ నిల్వలు అయిపోతున్నాయని తక్షణమే స్పందించాలని వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలు వేడు కుంటున్నాయి. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాన్షు తాము ఆక్సిజన్‌ సంక్షోభంలో ఉన్నామనీ, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని, ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేయడం గమనార్హం.

తాము ఫిర్యాదు చేసిన అరంట తర్వాత ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చిందని.. అప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఉన్న బాత్రా హాస్పిటల్‌లో 327 మంది పేషంట్లు ఉన్నారు. ఇందులో 48 మంది క్రిటికల్ కేర్‌లో ఉన్నారు. వీరందరికీ అత్యవసర చికిత్స అందుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని.. ఆక్సిజన్ అందుబాటులో ఉంటే.. ఇప్పటికిప్పుడు 9వందల ఆక్సిజన్ బెడ్లు సిద్దం అవుతాయన్నారు సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లు లేవని.. ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు.

దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరతపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వం మీద సీరియస్ అయింది. సాయంత్రాని కల్లా ఢిల్లీకి 498 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాలని ఆదేశించింది. హస్తినలో పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఆక్సిజన్ సరఫరాను వెంటనే చక్కదిద్దాలని ఆదేశించింది.

Read Also…  Vaccine Second Dose: క‌రోనా సెకండ్ డోస్ ఆల‌స్య‌మ‌వుతోంద‌ని టెన్ష‌న్ అవుతున్నారా.? ఏం ప‌ర్లేదు అంటోన్న నిపుణులు..