కరోనాకు అంతం ఎప్పుడంటే..

|

Jul 02, 2020 | 8:12 PM

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19 అంతంపై సంచలన వ్యాఖ్యలను చేశారు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా. ప్రపంచంలో...

కరోనాకు అంతం ఎప్పుడంటే..
Follow us on

CoronaVirus Pandemic Will End : ప్రపంచాన్ని కుదిపేస్తున్న కొవిడ్-19 అంతంపై సంచలన వ్యాఖ్యలను చేశారు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా. ప్రపంచంలో ఇప్పటికే కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించిన ఈ సమయంలో ప్రొఫెసర్ సునేత్ర గుప్తా చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కరోనా వైరస్‌ దానికదే సహజంగా అంతమవుతుందని సునేత్ర గుప్తా చెప్పారు. వ్యాక్సిన్‌ అవసరం పెద్దగా ఉండబోదని ఆమె అభిప్రాయపడ్డారు.

‘ఫ్లూ’ మాదిరిగానే కరోనా కూడా మన జీవితంలో ఒక భాగమవుతుందని ఎపిడెమియాలజిస్ట్ అయిన సునేత్ర తెలిపారు. వృద్దులు, ఇతర వ్యాధులు ఉన్న వ్యక్తులే ఎక్కువగా కరోనా బారిన పడ్డారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు ఈ వైరస్‌ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ అందరికీ అవసరం ఉండకపోవచ్చని.. ఎవరైతే వైరస్ కు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశమున్నదో వారికి మాత్రమే దీని అవసరం ఉంటుందని అన్నారు. లాక్‌డౌన్‌తో పూర్తి స్థాయిలో కరోనాకు అడ్డకట్ట వేయలేమని.. కొంత వరకు నియంత్రించగలమని వెల్లడించారు. కొన్ని దేశాలు ఇప్పటికే కరోనాకు కట్టడిలోకి తీసుకురావడంలో విజయం సాధించాయని.. అయితే భవిష్యత్తులో మరోసారి కరోనా భారినపడే ఛాన్స్ ఉందన్నారు.