
కరోనాతో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతుండగా చైనాలో ఓ ఫ్యాక్టరీ చేసిన పిచ్ఛపనిని అనేకమంది ఛీ కొట్టారు. సూజౌ అనే సిటీలో ఓ ఫర్నీచర్ ఫ్యాక్టరీ యాజమాన్యం తాము మళ్ళీ దీన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ముద్దుల పోటీ నిర్వహించారు. అయితే ఈ పోటీలో పాల్గొన్న జంటలమధ్య ఫ్లెక్సీ గ్లాస్ బిగించారు. కరోనా విలయ తాండవం చేస్తుండగా.. అసలు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇలాంటి పోటీలను నిర్వహించడమేమిటని అందరూ దుయ్యబట్టారు. చైనీస్ సోషల్ మీడియాలో సుమారు కోటిమంది ఈ వీడియోను చూశారట. ఈ కాంటెస్ట్ లో ఫ్యాక్టరీ ఉద్యోగులు కొందరు కూడా పాల్గొన్నారు. వీరిలో భార్యా భర్తలు కూడా ఉన్నారని, కిస్సర్ల మధ్య ఎటూ అడ్డుగా గ్లాస్ ఉండనే ఉంది గనుక ఎలాంటి ‘ప్రమాదమూ ‘ ఉండదని ఈ కర్మాగారం యజమాని చెబుతున్నాడు. పైగా ఆ గ్లాస్ ని డిస్ఇంఫెక్టెట్ చాలా సార్లు చేశామన్నారు. లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తున్న నేపథ్యంలో ఈ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ఈ నిర్వాకానికి పూనుకొంది. బ్లూ బాయిలర్ సూట్లు, ప్రొటెక్టివ్ ఫేస్ మాస్కులు ధరించి సుమారు 10 జంటలు ఈ కాంటెస్ట్ లో పాల్గొన్నాయి.
#China A furniture factory in Suzhou, Jiangsu had a “Kissing Contest” to celebrate the factory resuming work.
The organisers said this event can help the factory workers relax & there’s a transparent glass between the kissers.
Allegedly some of the participants are not couples. pic.twitter.com/9BWWpBkaAs
— W. B. Yeats (@WBYeats1865) April 19, 2020