
దేశంలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మొత్తం ప్రజా రవాణా అంతా స్తంభించిపోయింది. అయితే ఈ నెల 18 నుంచి ప్రారంభమైన నాలుగోదశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో పరిమితి సంఖ్యలో 50 శాతం మంది ప్రయాణీకులతో బస్సులు నడపవచ్చునని తెలిపింది. దీనితో రాష్ట్రాలన్నీ కూడా ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ప్రగతి రథచక్రాలు రయ్.. రయ్ అంటాయి.
రేపు ఉదయం 7 గంటల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనుండగా.. అందుకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రారంభించింది ఏపీఎస్ఆర్టీసీ. ఇక రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే బస్సుల్లో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. అటు ప్రతీ స్టేషన్‌లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణించేవారి వివరాలను కూడా సేకరిస్తారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ మొదటిగా పలు ప్రాంతాలకు బస్సులను నడపనుండగా.. వాటి వివరాలను ఆన్లైన్‌లో పొందుపరిచింది. విజయవాడ- విశాఖ మధ్య 6 సూపర్ లగ్జరీ, ఒక ఏసీ బస్సును నడుపుతామంది.
Read More:
షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!
10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..
రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్ఆర్పై వాహనాలకు అనుమతి…
మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..
కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..