Omicron sub-variant: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌.. షాకింగ్ విషయం చెప్పిన డెన్మార్క్‌ సైంటిస్టులు

|

Feb 02, 2022 | 11:11 AM

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA-2 దడ పుట్టిస్తోంది. శరవేగంగా వ్యాపి చెందుతూ భయాందోళనలు రేకెత్తిస్తోంది. BA-2 తీవ్రతపై డెన్మార్క్‌ సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Omicron sub-variant: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌.. షాకింగ్ విషయం చెప్పిన డెన్మార్క్‌ సైంటిస్టులు
Omnicron Subvariant
Follow us on

Omicron: ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA-2 పంజా విసురుతోంది. అసలు వేరియంట్‌ కన్నా శరవేగంగా వ్యాపిస్తోంది సబ్‌ వేరియంట్‌. ఈ BA-2 తీవ్రత ఏకంగా 39 శాతంగా నమోదైనట్టు తెలిపారు డెన్మార్క్‌ సైంటిస్టులు(Denmark Scientists). న్యూ వేరియంట్స్‌ ఎఫెక్ట్‌ ఎలా ఉందన్న అంశంపై పరిశోధనలు జరిపారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగాల్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి రేటు 29శాతముంటే.. BA-2వ్యాప్తి అసలు వేరియంట్‌ కంటే మరో 10శాతం..అంటే 39శాతంగా నమోదైంది. కరోనా వ్యాక్సిన్‌(Corona Vaccine) రెండు డోసులు తీసుకోని వారికి..ఈ వేరియంట్‌తో ముప్పు ఎక్కువగానే ఉందంటున్నారు. మరోవైపు ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోస్‌(Booster Dose) తీసుకోవాలని అంటున్నారు. దీని ద్వారా న్యూ వేరియంట్స్‌ నుంచి రక్షణ లభిస్తుందంటున్నారు.

ఇండియా కరోనా వివరాలు….(India Corona Updates)

దేశంలో ఒమిక్రాన్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. కరోనా బాధితులపై విరుచుకుపడుతోంది. ఒకవైపు కేసులు తగ్గుతుంటే..మరోవైపు మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులో 1733 మంది కరోనాకు బలయ్యారు. ఇక 24గంటల్లో 1,61,386 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్‌ కేసులు 16,21,603కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 9.26శాతంగా ఉంది. గత మూడు రోజులు కరోనా మరణాలు పెరుగుతున్నాయి వెయ్యికి పైగా మరణాలు నమోదు కావడం కలకలం రేపుతోంది. 24 గంటల్లో 1733 మంది కరోనాకు బలి కావడంతో ఒమిక్రాన్‌ సైలెంట్‌ పంజా విసురుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటు కేరళలో కూడా వారం రోజుల నుంచి కేసులు 50 వేలు దాటుతున్నాయి. మరొక్కసారి అక్కడ కరోనా పంజా విసురుతోంది. కరోనా మరణాలు అక్కడ కూడా పెరుగుతున్నాయి.

రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా..రూపాలు మార్చుకుంటూ విరుచుకుపడుతోంది. ఫస్ట్‌, సెకండ్ వేవ్స్‌ ముప్పు తొలగిందనుకునేలోపే..లేటెస్ట్‌గా ధర్డ్‌ వేవ్‌ విజృంభిస్తోంది.ఇప్పటికే పలు రకాల స్ట్రెయిన్స్‌ దడ పుట్టిస్తున్నాయి. ఒక మహమ్మారి పోయిందనుకునేలోపే మరో రూపంలో పంజా విసురుతోంది కొవిడ్‌ రక్కసి.

Also Read: ఆ బాధను ఫ్యామిలీ మొత్తం అనుభవించాలి.. యాంకర్ రష్మీ ఎమోషనల్ పోస్ట్..