కరోనా వైరస్ ని తరిమేశాం.. చైనా…నిజమేనా ?
చైనాలో కొత్త కరోనా వైరస్ కేసులు ఏవీ లేవట.. కేవలం ఒక్క కేసే నమోదైందని ఆ దేశం వెల్లడించింది. హుబీ ప్రావిన్స్ లోను, కరోనా వైరస్ జన్మ స్థలమని భావిస్తున్న వూహాన్ లోను వరుసగా 28 రోజుల్లో (ఏప్రిల్ 4 నుంచి) ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. శుక్రవారం నాటికి మొత్తం కన్ఫామ్ అయిన కేసులు 82,875 (పాత లెక్కే !) అని, 77,685 మంది కరోనా రోగులు […]

చైనాలో కొత్త కరోనా వైరస్ కేసులు ఏవీ లేవట.. కేవలం ఒక్క కేసే నమోదైందని ఆ దేశం వెల్లడించింది. హుబీ ప్రావిన్స్ లోను, కరోనా వైరస్ జన్మ స్థలమని భావిస్తున్న వూహాన్ లోను వరుసగా 28 రోజుల్లో (ఏప్రిల్ 4 నుంచి) ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. శుక్రవారం నాటికి మొత్తం కన్ఫామ్ అయిన కేసులు 82,875 (పాత లెక్కే !) అని, 77,685 మంది కరోనా రోగులు కోలుకున్నారని ఈ సంస్థ తెలిపింది. లోకల్ ఇన్ఫెక్షన్ కాని ఒకే ఒక్క కేసు శుక్రవారం నమోదైందట. అయితే 1671 ఇంపోర్టెడ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. హుబె ప్రావిన్స్ తమ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ని హయ్యెస్ట్ స్థాయి నుంచి సెకండ్ హయ్యెస్ట్ స్థాయికి తగ్గించినట్టు హెల్త్ కమిషన్ వెల్లడించింది. అంటే దీని అర్థం… కరోనాను తాము పూర్తిగా అదుపు చేసినట్టేనని ఈ ప్రావిన్స్ వైస్ గవర్నర్ యాంగ్ యునాన్ పేర్కొన్నారు. కాగా-కొత్తగా 20 ఎసింప్టోమాటిక్ కేసులు నమోదు కావడం చైనీయులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రష్యా నుంచి వస్తున్న స్వదేశీ చైనీయులు కూడా ఈ విధమైన కేసులకు కారణమవుతున్నారు.ఇలా ఉండగా… చైనా చేసిన ఈ ప్రకటన నిజమేనా అని ప్రపంచ దేశాలు అనుమానపు చూపులతో చూస్తున్నాయి.