కర్నాటకలో మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదు.. మంత్రి సుధాకర్

కర్ణాటకలో మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కె.సుధాకర్ స్పష్టం చేశారు. ఇక్కడ తిరిగి లాక్ డౌన్ విధించవచ్చునన్న ఊహాగానాలను ఆయనతోసిపుచ్చా రు. ఈ నెల 17 న ప్రధాని మోదీ తమ రాష్ట్ర ప్రభుత్వంతో..

కర్నాటకలో మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదు.. మంత్రి సుధాకర్

Edited By:

Updated on: Jun 14, 2020 | 6:54 PM

కర్ణాటకలో మళ్ళీ లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదని రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి కె.సుధాకర్ స్పష్టం చేశారు. ఇక్కడ తిరిగి లాక్ డౌన్ విధించవచ్చునన్న ఊహాగానాలను ఆయనతోసిపుచ్చా రు. ఈ నెల 17 న ప్రధాని మోదీ తమ రాష్ట్ర ప్రభుత్వంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తారని, అప్పుడు రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తామని ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలలోని కరోనా పరిస్థితులను తెలుసుకునేందుకు, భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించేందుకు మోదీ తరచూ ఈ విధమైన వీడియో కాన్ఫరెన్సులను నిర్వహిస్తుంటారని సుధాకర్ చెప్పారు. ఏమైనా… రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. కాగా కర్ణాటకలో 6,824 కరోనా కేసులు నమోదయ్యాయి. 81 మంది మరణించగా.. 3,648 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.