Corona Cases In India: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గతేడాది కరోనా తీవ్రతను దాటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదుకాగా 794 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 1,32,05,926 మందికి కరోనా సోకగా.. 1,68,436 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ భయాందోళనలకు గురి చేస్తోంది. ఇక్కడ కొత్తగా 55, 411 కరోనా కేసులు నమోదుకాగా 309 మంది మరణించారు. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఒక్కరోజే 9,327 మంది కరోనా బారినపడగా.. 50 మంతి మృతి చెందారు. గుజరాత్‌లో కొత్తగా గుజరాత్‌లో 5,011 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 49 మంది మృతిచెందారు. ఇక తమిళనాడు విషయానికొస్తే ఇక్కడ కొత్తగా 5,989 మంది కరోనా బారిన పడగా వీరిలో 23 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో కొత్తగా 6,955 కేసులు నమోదుకాగా 36 మృతిచెందారు. ఛత్తీస్‌గడ్‌లోనూ కరోనా కేసులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇక్కడ కొత్తగా 14,098 కొత్త కరోనా కేసులు నమోదు కాగా 97 మంది మరణించారు. ఇక తెలుగు రాష్ట్రాలన్లోనూ కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. తెలంగాణలో రోజువారీ కోవిడ్ కేసులు 3 వేలకు చేరువలో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,24,091 మందికి కరోనా సోకగా 1752 మంది మృతి చెందారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3,309 కేసులు నమోదుకాగా 12 మంది మృత్యువాత పడ్డారు.
Also Read: Maharastra Covid Update : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?