పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా టెర్రర్.. 120 మందికి పైగా కరోనా

| Edited By:

Jun 12, 2020 | 5:52 PM

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకీ పెరిగిపోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రభుత్వ ఉద్యోగులకు, డాక్టర్లకు, పోలీసులకు ఎక్కువగా సోకుంది. వైరస్ బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఎన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నా..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కరోనా టెర్రర్.. 120 మందికి పైగా కరోనా
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజకీ పెరిగిపోతున్నాయి. అందులోనూ ముఖ్యంగా ఈ వైరస్ ప్రభుత్వ ఉద్యోగులకు, డాక్టర్లకు, పోలీసులకు ఎక్కువగా సోకుతుంది. వైరస్ బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఎన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నా.. చాప కింద నీరులా ఈ వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. తాజాగా గురువారం ఒక్క రోజే 20 మంది పోలీసులకు పాజిటివ్ వచ్చింది. వీరిలో ఇక ఏసీపీ, ఇద్దరు ఎస్‌ఐలు సహా మరో 17 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు. దీంతో వారికి సంబంధించిన పోలీసులందర్నీ క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.

కాగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 120 మందికి పైగా ఈ వైరస్ సోకింది. లాక్‌డౌన్ అమలు, వలస కూలీల తరలింపు, కంటైన్‌మెంట్ జోన్లపై నిఘా, ఆస్పత్రుల వద్ద బందోబస్తు తదితర అంశాల్లో పోలీసులు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో పలువురు వైరస్ బారిన పడ్డారు. కొందరికి ఎలా సోకిందో అంతుచిక్కడం లేదు. మొత్తం మూడు కమిషరేట్ పరిధిల్లో హైదాబాద్‌లో 140 మందికి, సైబరాబాద్‌లో 12 మందికి, రాచకొండలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది.

రోజురోజుకీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వెంటనే యూనిట్ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఏ మాత్రం లక్షణాలు కనిపించినా హోం క్వారంటైన్‌లోకి వెళ్లేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అలాగే రోజుకు కనీసం 500-600 మంది ఆరోగ్యంపై ఎంక్వైరీ చేస్తున్నారు.

Read More:

బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్ కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లో పాజిటివ్ కలకలం

పెన్షన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్‌వో

ఏపీలో ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు.. న్యూ కండిషన్స్ ఇవే!

అభిమాని అద్భుతమైన స్కెచ్.. జీవితానికి ఇది చాలంటున్న సోనూ..