ముక్కు ద్వారా వ్యాక్సిన్‌.. ఎలుకలపై సక్సెస్‌

| Edited By:

Aug 23, 2020 | 5:53 PM

కరోనా వైరస్‌ని ఎలాగైనా అరికట్టాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ప్రపంచ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యారు.

ముక్కు ద్వారా వ్యాక్సిన్‌.. ఎలుకలపై సక్సెస్‌
Follow us on

Vaccine trails for Covid 19: కరోనా వైరస్‌ని ఎలాగైనా అరికట్టాలన్న దృఢ సంకల్పంతో ఉన్న ప్రపంచ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కీలక దశలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ముక్కు ద్వారా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌ ఎలుకలపై సమర్థవంతంగా పని చేసి, వైరస్‌ని అరికట్టింది. ఇక ఈ వ్యాక్సిన్‌ వలన రోగ నిరోధక వ్యవస్థ కూడా బలోపేతం అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ముక్కు, శ్వాస మార్గంలో ఇది మరింత ఎఫెక్టివ్‌గా పని చేస్తోందని.. శరీరంలోకి ఇన్ఫెక్షన్ చేరకుండా అడ్డుకుంటోందని పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదేనా..? కరోనాపై సమర్థవంతంగా పోరాడుతుందా..? అనే విషయంపై నిర్ధారణ కోసం కోతులు, మనుషులపై ప్రయోగించేందుకు ఈ పరిశోధక బృందం ప్రణాళికలు రచిస్తోంది. ఎలుకల్లో ముక్కు ద్వారా, ఇంజెక్షన్ రూపంలో ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇంజెక్షన్ రూపంలోని వ్యాక్సిన్‌ న్యుమోనియాను అరికట్టింది కానీ ముక్కు, ఊపిరితితుల్లో ఇన్ఫెక్షన్‌ను నిరోధించలేకపోయిందని..  ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్ మాత్రం సమర్థవంతంగా పని చేసిందని వారు చెబుతున్నారు.

Read More:

ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌లో సీటు సాధించిన జగన్‌ పెద్ద కుమార్తె

నా హోటల్‌కి అనుమతిని ఇవ్వండి: నిత్యానందకు ప్రముఖ వ్యాపారవేత్త లేఖ