‘ఫ్యూచర్ సూపర్‌స్టార్’ను చూశారా…

|

Jul 07, 2020 | 5:56 PM

కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న సినీ ప్రముఖులు తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. సామాజిక మధ్యమాల్లో యాక్టివ్‌గాఉండే నమ్రతా.. మహేష్ గురించి, పిల్లలు గౌతమ్, సితారల గురించి తరచుగా పోస్టులు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా నమ్రత మరో ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అది తన ముద్దుల కుమారుడు గౌతమ్ ఫోటో.. అయితే ఫోటోతోపాటు ఓ కామెంట్ కూడా […]

ఫ్యూచర్ సూపర్‌స్టార్ను చూశారా...
Follow us on

కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న సినీ ప్రముఖులు తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. సామాజిక మధ్యమాల్లో యాక్టివ్‌గాఉండే నమ్రతా.. మహేష్ గురించి, పిల్లలు గౌతమ్, సితారల గురించి తరచుగా పోస్టులు చేస్తుంటారు.

ఇప్పుడు తాజాగా నమ్రత మరో ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అది తన ముద్దుల కుమారుడు గౌతమ్ ఫోటో.. అయితే ఫోటోతోపాటు ఓ కామెంట్ కూడా జోడించారు.`ఎలూసివ్ సన్` అంటూ జత చేసింది.  ఎలూసివ్ అంటే’అంతుచిక్కని’ అని అర్థం వస్తుంది. ఇలా తన ముద్దుల జూనియర్ సూపర్ స్టార్‌ను మెచ్చుకుంది. ఈ ఫోటోలో క్రాఫ్ ను పైకి దువ్వుకుని నవ్వుతూ కనిపిస్తారు. ఇది చూసిన ఫ్యాన్స్ తెగ ముచ్చట పడిపోతున్నారు. `ఫ్యూచర్ సూపర్‌స్టార్` అంటూ మహేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.