
లాక్‌డౌన్ కొందరికి శాపంగా మారితే.. మరికొందరికి వరంగా మారింది. మటన్ వ్యాపారులు లాక్‌డౌన్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. మామూలు రోజులకంటే ధరలు బాగా పెంచి దొచుకుంటున్నారు. మరికొందరు మటన్ షాపుల పేరుతో కల్తీ మాంసం అమ్మకాలు జరుపుతున్నారు. మొన్న హైదరాబాద్‌లో వెలుగు చూసిన మటన్ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఏపీకి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కల్తీ మటన్ గుట్టరట్టు చేశారు. అధికారులు.
నెల్లూరు జిల్లాలో మాంసం విక్రయదారులు కల్తీ దందాకు తెరలేపారు. అడ్డగోలుగా కల్తీ మాంసం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మేక మాంసంలో గేదె, గో మాంసం కలిపి ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. విషయం పసిగట్టి అధికారులు మెరుపు నెల్లూరు పట్టణంలోని మాంసం దుకాణాలపై మెరుపు దాడులకు దిగారు. పలు మటన్ షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన డబ్బాల కొద్దీ కల్తీ మటన్‌ని గుర్తించిన అధికారులు ఖంగుతిన్నారు. టన్నుల కొద్దీ బయటపడ్డ మాంసం నిల్వలు, జంతు కళేబరాలు, చర్మాలను అధికారులు సీజ్ చేశారు. బాధ్యులపై కేసులు నమోదు చేశారు. గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడిన పలువురిపై అధికారులు జరిమాన విధించారు. అయినప్పటికీ వ్యాపారుల తీరు మారలేదు. ఈ సారి కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా హెల్త్ ఆఫీసర్ వెంకటర మరణ పేర్కొన్నారు.