ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే ఎనిమిది వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో రెండు లక్షల వరకు వైరస్ సోకి ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో మనదేశంలో కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇక పలు రాష్ట్రాలైతే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపిస్తున్న క్రమంలో బహిరంగ పారిశుద్ధం విషయంలో కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక ముంబై నగరంలో ఎక్కడైనా బహిరంగంగా ఉమ్మి వేస్తే అంతే సంగతులు. వేసిన ప్రతిసారి వెయ్యిరూపాయల ఫైన్ విధిస్తున్నారు. ఇప్పటికే ముంబై నగరంలో బహిరంగంగా ఉమ్మివేసిన 107 మంది దగ్గరనుంచి..రూ.1.07లక్షల జరిమానాను వసూలు చేసినట్లు.. బీఎంసీ అధికారులు తెలిపారు. మరో 46 మందికి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా.. అందరు సహకరించాలని.. ముంబై వాసులు కూడా.. జాగ్రత్తలు వహించాలని బీఎంసీ అధికారులు కోరారు. ఎవరైనా బహిరంగంగా… ఉమ్మివేస్తే.. వెయ్యి రూపాయల జరిమానా లేదా.. ఐపీసీ సెక్షన్ 189.. ప్రకారం అరెస్టు కూడా చేస్తామని బీఎంసీ అధికారి హెచ్చరించారు.