షాకింగ్.. రైలు నుంచి 167 మంది వలస కార్మికులు ఆదృశ్యం..!

లాక్‌డౌన్‌ వలన దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాకు పంపేందుకు శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్ నుంచి వలస కార్మికులను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలించారు. అయితే అలా తరలించిన రైళ్లో 167 మంది వలస కార్మికులు అదృశ్యమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం 1,340 మంది వలస కార్మికులతో మే 12న సూరత్ నుంచి ప్రత్యేక రైలు రాగా.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 […]

షాకింగ్.. రైలు నుంచి 167 మంది వలస కార్మికులు ఆదృశ్యం..!

Edited By:

Updated on: May 15, 2020 | 6:43 AM

లాక్‌డౌన్‌ వలన దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాకు పంపేందుకు శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్‌లోని సూరత్ నుంచి వలస కార్మికులను ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు తరలించారు. అయితే అలా తరలించిన రైళ్లో 167 మంది వలస కార్మికులు అదృశ్యమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం 1,340 మంది వలస కార్మికులతో మే 12న సూరత్ నుంచి ప్రత్యేక రైలు రాగా.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అందులో 1,173 మంది మాత్రమే ఉన్నారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. కనిపించకుండా పోయిన వలస కార్మికులు రైలు బయలుదేరినప్పుడు అందులోనే ఉన్నారా..? లేక మధ్యలో ఎక్కడైనా దిగి వెళ్లారా..? అన్న కోణాల్లో విచారణ చేపడుతున్నారు.

 

Read This Story Also: లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. అక్కడ ఎన్ని కోట్లు వసూలయ్యాయంటే..!