ప్రధానిపై వాట్సప్‌ గ్రూప్‌లో అభ్యంతరకర చిత్రాలు.. తండ్రీకొడుకుల అరెస్ట్‌..

| Edited By:

Apr 07, 2020 | 10:59 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్‌ 14 వరకు) ఈ లాక్‌డౌన్‌ విధించింది. అయితే ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు.. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతేకాదు.. లాక్‌డౌన్‌ అంశంపై కూడా ప్రజల్లో ఆందోళనలు కలిగేలా పోస్టింగులు పెడుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెటిజన్లందరినీ హెచ్చరించాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుడు […]

ప్రధానిపై వాట్సప్‌ గ్రూప్‌లో అభ్యంతరకర చిత్రాలు.. తండ్రీకొడుకుల అరెస్ట్‌..
Follow us on

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్‌ 14 వరకు) ఈ లాక్‌డౌన్‌ విధించింది. అయితే ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు.. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అంతేకాదు.. లాక్‌డౌన్‌ అంశంపై కూడా ప్రజల్లో ఆందోళనలు కలిగేలా పోస్టింగులు పెడుతున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెటిజన్లందరినీ హెచ్చరించాయి. సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుడు సమాచారం పోస్టింగ్ చేసినా.. కఠినమైన చర్యలు తప్పవని వార్నింగ్‌లు ఇచ్చాయి. అయినప్పటికీ.. కొందరు ఆకతాయిలు తీరు మారడం లేదు. తాజాగా.. ఢిల్లీలోని నోయిడాలో ప్రధాని మోదీపై అభ్యంతరకర చిత్రాలని పోస్టింగ్ చేశారన్న ఆరోపణలపై.. అబ్దుల్‌ సలామ్‌, అతని కుమారుడు రహ్మత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 153ఏ, 505,506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వీరే కాకుండా.. గ్రేటర్‌ నోయిడాలో కూడా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు కరోనాపై అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని.. ఇక మరో వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్‌ను కూడా అరెస్ట్ చేశామన్నారు.