అక్కడ మే 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు.!
మహారాష్ట్రలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని మహా సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబై, పూణే, మాలెగావ్, పింప్రి-చించ్వాద్ ప్రాంతాల్లోని రెడ్ జోన్లు, హాట్ స్పాట్స్‌లలో మరింత కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గురవారం సీఎం ఉద్ధవ్ థాక్రే కొందరు కేబినేట్ మంత్రులతో మే 17 తర్వాత అమలు చేయాల్సిన లాక్ డౌన్ ప్రణాళికపై చర్చించారు. కాగా, రాష్ట్రంలోని రెడ్ జోన్లు, […]

మహారాష్ట్రలో మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించాలని మహా సర్కార్ భావిస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబై, పూణే, మాలెగావ్, పింప్రి-చించ్వాద్ ప్రాంతాల్లోని రెడ్ జోన్లు, హాట్ స్పాట్స్‌లలో మరింత కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్‌ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గురవారం సీఎం ఉద్ధవ్ థాక్రే కొందరు కేబినేట్ మంత్రులతో మే 17 తర్వాత అమలు చేయాల్సిన లాక్ డౌన్ ప్రణాళికపై చర్చించారు. కాగా, రాష్ట్రంలోని రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో నాలుగోదశ లాక్ డౌన్ వివరాలను ఇవాళ మహా సీఎం ప్రధానికి పంపించనున్నారు.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 27,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ బారిన పడి 1,019 మంది మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 1,602 కొత్త కేసులు నమోదు కాగా.. 44 మంది ప్రాణాలు విడిచారు. అటు కరోనా కేసులు ఎక్కువగా ముంబై, పూణే, థానేలలోనే నమోదవుతున్నాయి.
Read This: కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!




