విమానాలకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్ !

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 7:48 PM

విమానాల రాకపోకలకు మహారాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఇప్పుడే విమానాల పునరుధ్ధరణ వద్దని ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే కేంద్రాన్ని కోరిన కొన్ని గంటలకే..

విమానాలకు మహారాష్ట్ర గ్రీన్ సిగ్నల్ !
Follow us on

విమానాల రాకపోకలకు మహారాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఇప్పుడే విమానాల పునరుధ్ధరణ వద్దని ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే కేంద్రాన్ని కోరిన కొన్ని గంటలకే.. సర్కార్ దీనిపై యు-టర్న్ తీసుకుంది. సోమవారం నుంచి 25 విమానాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు. తాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని, అన్ని ఏజెన్సీలను సంప్రదింఛాక.. రేపటి నుంచి ముంబై ఎయిర్ పోర్టు నుంచి 25 విమానాలను ఆపరేట్ చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందన్నారు. కాగా.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.