Maharashtra corona cases: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. కొత్తగా 278 మంది మృత్యువాత

|

Apr 14, 2021 | 9:34 PM

మహారాష్ట్రలో కరోనా విజృంభణ మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Maharashtra corona cases: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా మరణ మృదంగం.. కొత్తగా 278 మంది మృత్యువాత
Maharashtra Corona Updates
Follow us on

మహారాష్ట్రలో కరోనా విజృంభణ మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా 50 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అంతేస్థాయిలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టివ్ ‌కేసుల సంఖ్య 6 లక్షలు దాటింది. దీంతో చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

తాజాగా మంగళవారం నుంచి బుధవారం వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 58,952 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇక, కరోనాను జయించలేక 278 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 35,78,160కు చేరుకుంది. ఇక ఇప్పటివరకు మరణాల సంఖ్య 58,804కు చేరింది. అలాగే ముంబైలో బుధవారం రికార్డుస్థాయిలో 9,925 కరోనా కేసులు, 54 మరణాలు నమోదయ్యాయని మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 39,624 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,05,721కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,12,070 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతుంది.
మహారాష్ట్ర కరోనా కేసులు:

Read Also… కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన బొలేరో వాహనం.. ముగ్గురు యువకులు మృతి