మహా పోలీసులను వదలని కరోనా..కొత్తగా 70మందికి పాజిటివ్

|

Oct 22, 2020 | 4:36 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది.

మహా పోలీసులను వదలని కరోనా..కొత్తగా 70మందికి పాజిటివ్
Follow us on

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతూనే ఉంది. వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. ముఖ్యంగా పోలీసు సిబ్బందిని కరోనా మహమ్మారి వణికిస్తోంది. గురువారం కొత్తగా మరో 70 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,988కి చేరింది. కాగా, ఇప్పటి వరకు 23,945 మంది పోలీసులు కరోనా నుంచి కోలుకున్నారు. 1771 మంది కరోనాతో ఇంకా చికిత్స పొందుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసు శాఖలో 272 మంది కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో మొత్తం 14,15,679 మందికి కరోనా సోకగా వారిలో 42,633 మంది మరణించినట్లు సమాచారం.