Mumbai Corona: మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. ముంబైలో పాజివిటీ 24.3 శాతం.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు!

|

Jan 13, 2022 | 8:15 AM

గత నాలుగు రోజులుగా కోవిడ్ -19 కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత , ముంబైలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో విపరీతమైన పెరుగుదల నమోదైంది.

Mumbai Corona: మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా.. ముంబైలో పాజివిటీ 24.3 శాతం.. లక్ష దాటిన యాక్టివ్ కేసులు!
Covid
Follow us on

Covid-19 positive cases surge in Mumbai: గత నాలుగు రోజులుగా కోవిడ్ -19 కేసులు(Covid 19 Cases) తగ్గుముఖం పట్టిన తర్వాత , ముంబై(Mumbai)లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులలో విపరీతమైన పెరుగుదల నమోదైంది. గత 24 గంటల్లో రోజువారీ కేసుల పెరుగుదల సానుకూల రేటు(Positivity rate) పెరుగుదలకు అనుగుణంగా ఉంది. ఇది మంగళవారం 18.7 శాతం నుండి బుధవారం 24.3 శాతానికి పెరిగింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో ముంబై మెట్రోపాలిస్‌లో 16,420 కొత్త కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది ముందు రోజు కంటే 40 శాతం ఎక్కువ. మంగళవారం ముంబై నగరంలో 11,647 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. మంగళవారం నాటికి 18.75% ఉన్న కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు 24.38%కి పెరిగింది. గత 24 గంటల్లో, ఇక్కడ కరోనా కారణంగా 7 మంది రోగులు మరణించారు. బుధవారం రోజు 67,339 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిగాయి. ఇది ముందు రోజు కంటే 9 శాతం ఎక్కువ. ఇప్పుడు నగరంలో క్రియాశీల రోగుల సంఖ్య 1,02,282కి పెరిగింది. బుధవారం వెలుగుచూసిన 16,420 మంది కొత్త రోగులలో 13,793 మంది అంటే దాదాపు 83 శాతం మంది లక్షణాలు లేకుండా ఉన్నారు. బుధవారం మొత్తం 916 మంది రోగులు ఆసుపత్రిలో చేరగా, వారిలో 98 మందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడిందని బీఎంసీ అధికారులు వెల్లడించారు.

గత 10 రోజుల్లో ముంబైలో నమోదైన కొత్త కేసులు – పాజిటివిటీ రేట్లు ఇలా ఉన్నాయి…

జనవరి 12 – 16,420 కేసులు, పాజిటివిటీ 24.38%

జనవరి 11 – 11,647 కేసులు, పాజిటివిటీ 18.75%

జనవరి 10 – 13,648 కేసులు, పాజిటివిటీ 23%

జనవరి 9 – 19,474 కేసులు, పాజిటివిటీ 28.53%

జనవరి 8 – 20,311 కేసులు, పాజిటివిటీ 28.94%

జనవరి 6 – 20181 కేసులు, పాజిటివిటీ 29.90%

జనవరి 5 – 15,166 కేసులు, పాజిటివిటీ 25.27%

జనవరి 4 – 10,860 కేసులు, పాజిటివిటీ 21.86%

ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆస్పత్రుల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కనీసం 48 గంటలకు సరిపడా బఫర్ స్టాక్ ఉండేలా చూసుకోవాలని సూచించింది. పీఎస్‌ఏ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పనితీరును నిర్ధారించుకోవడంతో పాటు, సిలిండర్ల లభ్యతను సరిచూసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. అన్ని పరికరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, అవసరానికి తగ్గట్టుగా స్పందించేందుకు వీలుగా అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కాగా, కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమవుతున్నాయి రాష్ట్రాలు. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించేలా సిద్ధం చేస్తున్నాయి.

Read Also….  Omicron Variant: ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న వేళలో చిన్నారుల విషయంలో టెన్షన్ వద్దు.. జాగ్రత్తలే ముద్దు!