మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం వందల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సోమవారం నాడు కొత్తగా మరో 354 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,284కి చేరింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24
గంటల్లో కరోనా బారినపడి 9 మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య్ 617కి చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఇండోర్‌లోనే నమోదవుతున్నాయి.
కాగా, దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు ఏడు లక్షలకు చేరవయ్యాయి. ఇప్పటికే 6.97 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం 2.53 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 4.24 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య ఇరవై వేలకు చేరువైంది.
354 new #COVID19 cases have been reported in Madhya Pradesh today, taking the total number cases to 15,284. Death toll rises to 617 after 9 deaths were reported today: State Health Department
— ANI (@ANI) July 6, 2020