కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..

|

May 27, 2020 | 4:36 PM

హెచ్ఐవీకి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కేవలం ఆరు రోజుల్లోనే కరోనా మహమ్మారిని జయించాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొండా జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఉన్న తన బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు దగ్గరలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. […]

కరోనాను జయించిన హెచ్ఐవీ పేషంట్..
Follow us on

హెచ్ఐవీకి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి కేవలం ఆరు రోజుల్లోనే కరోనా మహమ్మారిని జయించాడు. ఈ సంఘటన లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గొండా జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఉన్న తన బంధువులను కలిసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ యాక్సిడెంట్ కు గురయ్యాడు.

ఆ ప్రమాదంలో అతడికి తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు దగ్గరలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. వైద్యులు అతనికి పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అటు బాధితుడు తనకు హెచ్ఐవీ ఉందని.. కొద్దికాలంలో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించాడు. ఈ క్రమంలో డాక్టర్లు దానికి తగ్గట్టుగా తడికి చికిత్సను అందించారు. ఇంకేముంది కరోనా మహమ్మారిని కేవలం 6 రోజుల్లోనే అతడు జయించి డిశ్చార్జ్ అయ్యాడు.

దేశంలో ఇలాంటి కేసు రావడం ఇదే ప్రధమం. కరోనా ప్రోటోకాల్ ప్రకారమే అతడికి వైద్యం చేశాం. కేవలం ఆరు రోజుల్లోనే కరోనాను జయించాడు. అనంతరం పరీక్షలు చేయగా రెండుసార్లు టెస్ట్ రిపోర్టులు నెగటివ్ వచ్చాయి. దీనితో అతడిని డిశ్చార్జ్ చేసి 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించామని అక్కడి డాక్టర్లు స్పష్టం చేశారు.