లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు అమలు చేయాల్సిందే.. అరవింద్ కేజ్రీవాల్

కరోనా వైరస్ పై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ అనిల్ బైజాల్ జారీ చేసిన ఉత్తర్వులను పాటించాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ అన్నారు. గవర్నర్ ఆదేశాలతో విభేదించడానికి ఇది సమయం కాదన్నారు..

లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు అమలు చేయాల్సిందే.. అరవింద్ కేజ్రీవాల్

Edited By:

Updated on: Jun 10, 2020 | 12:48 PM

కరోనా వైరస్ పై లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ అనిల్ బైజాల్ జారీ చేసిన ఉత్తర్వులను పాటించాల్సిందేనని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ అన్నారు. గవర్నర్ ఆదేశాలతో విభేదించడానికి ఇది సమయం కాదన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు గెలిచిందని, కరోనా వైరస్ పై కేంద్రం జారీ చేసిన ఆదేశాలనే గవర్నర్ కూడా జారీ చేశారని ఆయన చెప్పారు. దీన్ని అమలు చేయాల్సిందే అన్నారు. దీనిపై వివాదం గానీ, చర్చ గానీ అనవసరమన్నారు. కరోనా వైరస్ నెగెటివ్ గా తేలడంతో అరవింద్ కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లోనూ, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పడకలను ఢిల్లీ వాసులకే రిజర్వ్ చేయాలనీ, కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహించాలని కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.