కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ప్రేమ క‌థ‌…క‌ట్‌చేస్తే… శుభంకార్డు

|

Jul 28, 2020 | 9:14 PM

కోవిడ్‌-19..మ‌నుషుల్లో భ‌యాన్ని మాత్ర‌మే కాదు.. ప్రేమ‌ను కూడా చిగురింప జేసింది. వారి ప్రేమ క‌థ‌‌ను నిజం చేస్తూ...పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్లింది...

కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ప్రేమ క‌థ‌...క‌ట్‌చేస్తే... శుభంకార్డు
Follow us on

కోవిడ్‌-19..మ‌నుషుల్లో భ‌యాన్ని మాత్ర‌మే కాదు.. ప్రేమ‌ను కూడా చిగురింప జేసింది. వారి ప్రేమ క‌థ‌‌ను నిజం చేస్తూ…పెళ్లి వ‌ర‌కు తీసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేటు క్వారంటైన్‌ సెంట‌ర్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా సోకింది. దీంతో వీరిద్దరూ గుంటూరులోని ఓ కొర్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఇద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. దీంతో, తొలుత మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి. చికిత్స సమయంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కరోనా నుంచి కోలుకున్నారు. ఇద్దరికీ నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి వారు డిశ్చార్జ్ అయ్యారు.

ఇంటికి వెళ్లిన తర్వాత తమ ప్రేమ గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అమ్మాయి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. దీంతో తల్లిదండ్రులు వారి పెళ్లికి అడ్డు చెప్పలేదు. చివ‌ర‌కు వారిద్దరూ పెద్దల సమక్షంలో పొన్నూరులోని ఒక దేవాలయంలో మంగ‌ళ‌వారం రోజు పెళ్లి చేసుకున్నారు. అలా 14 రోజుల క్వారంటైన్ లో వారి ప్రేమ కథ ప్రారంభమై, జూలై 28న జ‌రిగిన పెళ్లితో ఇరువురు ఒక్క‌ట‌య్యారు.