ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఇక నుంచి!

| Edited By:

Apr 14, 2020 | 12:07 PM

ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీల పేరుతో బ్యాంకులు నడ్డి విరుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తన వినియోగదారులకు...

ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్‌న్యూస్.. ఇక నుంచి!
Follow us on

ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. సాధారణంగా వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఛార్జీల పేరుతో బ్యాంకులు నడ్డి విరుస్తాయనే సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో తన వినియోగదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గుడ్‌ న్యూస్ చెప్పింది. మినిమమ్ బ్యాలెన్స్‌ లేని ఖాతాలపై విధిస్తున్న ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ ఛైర్మన్ అర్వింద్ తెలిపారు. ఇక ప్రస్తుతం రూరల్, సెమీ అర్బన్ ఏరియాల్లో మినిమ్ బ్యాలెన్స్ రూ. 450, అర్బన్ ప్రాంతాల్లో రూ. 1500 మెయింటైన్ చేయాల్సి ఉంది. లేని పక్షంలో టీజీబీ రూ.250 ఛార్జి వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ ఛార్జీని కూడా ఎత్తివేసింది. కాగా ఇప్పటికే ఎస్బీఐ బ్యాంకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసింది.

ఇవి కూడా చదవండి:

లాక్‌డౌన్ టైం.. మద్యం సేవిస్తూ పట్టుబడ్డ అధికారులు

స్వైన్‌ ఫ్లూ కంటే కరోనా పది రెట్లు ప్రమాదకరం

21 రోజుల లాక్‌డౌన్ దెబ్బకి.. రూ.8 లక్షల కోట్ల నష్టం

జూ.ఎన్టీఆర్ కెరీర్‌లో విడుదల కాని ఫస్ట్ సినిమా ఇదే..!