లాక్‌డౌన్ పొడిగింపు…ప్రైవేట్ ట్రావెల్స్ కీల‌క నిర్ణ‌యం..

|

May 13, 2020 | 4:53 PM

ప్రైవేట్ ర‌వాణా వాహ‌నాలు 3 నెల‌ల పాటు న‌డ‌ప‌క‌పోతే ప‌న్ను నుంచి మిన‌న‌హాయింపు పొంద‌వ‌చ్చు మార్చిలో లాక్‌డౌన్ విధించ‌డంతో ...

లాక్‌డౌన్ పొడిగింపు...ప్రైవేట్ ట్రావెల్స్ కీల‌క నిర్ణ‌యం..
Follow us on

క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు నేటితో 50 రోజులు అయ్యింది. దేశ‌మంతా మార్చి 24 అర్ధ‌రాత్రి నుంచి ఏప్రిల్‌14 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. అనంత‌రం మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించారు. ఆ త‌ర్వాత మే 17 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ప్ర‌క‌టించింది. నిన్న జాతిని ఉద్దేశించి మ‌రోమారు ప్ర‌సంగించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మే 18 నుంచి 4వ ద‌శ లాక్‌డౌన్ మొద‌లు కానున్న‌ట్లు తెలిపారు. కానీ, ఈ సారి లాక్‌డౌన్‌లో అనేక స‌డ‌లింపులు ఉంటాయ‌ని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ర‌వాణా వ్య‌వ‌స్థ‌లోనూ వెసులుబాటు ఉంటుంద‌ని చెప్పారు. కానీ, అక్క‌డి ప్రైవేట్ ట్రావెల్స్ యాజ‌మాన్యం మాత్రం ఇప్పుడ‌ప్పుడే త‌మ బ‌స్సుల‌ను న‌డ‌ప‌బోయేది లేద‌ని చెబుతున్నాయి.

 

క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఏపీలో ప్ర‌వేట్ ట్రావెల్స్ యాజ‌మాన్యం గ‌ట్టి నిర్ణ‌యం ప్ర‌క‌టించాయి. జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు బ‌స్సులు న‌డ‌ప‌మ‌ని ప‌లు ప్రైవేట్ ట్రావెల్స్ యాజ‌మాన్యాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ఇప్ప‌టికే ర‌వాణాశాఖకు ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్నాయి.  రాష్ట్రంలో దాదాపు 800 ట్రావెల్స్ బ‌స్సులున్నాయి.  అయితే ప్రైవేట్ ర‌వాణా వాహ‌నాలు 3 నెల‌ల పాటు న‌డ‌ప‌క‌పోతే ప‌న్ను నుంచి మిన‌న‌హాయింపు పొంద‌వ‌చ్చు మార్చిలో లాక్‌డౌన్ విధించ‌డంతో ఈ యాజ‌మాన్యాలు జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు బ‌స్సులు న‌డ‌ప‌బోమ‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి.