నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

|

May 04, 2020 | 11:04 AM

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. అటు […]

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..
Follow us on

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు.

మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే మద్యం అమ్మకాలపై మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. అటు మద్యం ధరలను 25 శాతం పెంచుతున్నామని వెల్లడించిన రాజత్ భార్గవ్.. లిక్కర్ సేల్స్ తగ్గించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు మద్యం షాపుల వద్ద ప్రజలు తప్పనిసరి కొన్ని నిబంధనలు పాటించాలన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్క్ ధరించాలని వెల్లడించారు. షాపులోకి కేవలం 5 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని.. రద్దీ మరీ ఎక్కువగా ఉంటే ఆ షాపులు కొంత సమయం మూసివేస్తామన్నారు. ఇక మాస్క్ లేకపోతే మద్యం దుకాణాలకు అనుమతి లేదన్నారు. అంతేకాకుండా బార్‌లు ఎట్టి పరిస్థతుల్లోనూ ఓపెన్ చేయకూడదని స్పష్టం చేశారు.

Read More: 

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..