Vaccine Certificate: కరోనా కారణంగా ప్రపంచదేశాలు ప్రయాణాలపై నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పటట్డంతో మళ్లీ ఆంక్షలు సడలిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి కరోనా వ్యాక్సినేషన్ తప్పనిసరి అనే నిబంధనలను పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపే సర్టిఫికేట్లను చూపించాల్సి ఉంటుంది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారో.. వారు సంబంధిత పాస్ట్ పోర్ట్ పోర్టల్ లో మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎప్పుడు వేయించుకున్నారనే సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రయాణికులకు మాత్రమే కేంద్రం వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందిస్తుంది. మరి ఈ వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను ఎలా పొందాలనేగా మీ సందేహం.. అయితే ఈ కింది స్టెప్పులను ఫాలో అవడమే..
* ముందుగా కోవిన్ పోర్టల్‌లో ప్రయాణికులు పాస్ పోర్ట్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది.
* ఇందుకోసం తొలుత http://cowin.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం మీ ఓటీపీ ఆధారంగా లాగిన్ కావాలి.
* తర్వాత సెలక్ట్ రైజ్ అన్ ఇష్యూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఆప్షన్స్‌ను స్క్రోల్ చేస్తే.. యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్‌ను ఎంచుకోవాలి.
* అనంతరం పాస్‌పోర్ట్ నెంబర్‌ను ఎంటర్ చేసి, ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో సెలక్ట్ చేసుకోవాలి.
* చివరిగా సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. దీంతో వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను పొందొచ్చు.
Third wave: కరోనా థర్డ్ వేవ్‌పై ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ చదవండి