కరోనా భయం.. సౌదీలో నిరాడంబరంగా ‘హజ్’

| Edited By: Pardhasaradhi Peri

Jun 23, 2020 | 6:05 PM

కరోనా వైరస్ కారణంగా ఈ సారి సౌదీ అరేబియాలో పరిమితంగా 'హజ్' నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం స్థానిక ప్రజలనే ఇందుకు అనుమతించనున్నారు. గత ఏడాది సుమారు ఇరవై అయిదు లక్షల..

కరోనా భయం.. సౌదీలో నిరాడంబరంగా హజ్
Follow us on

కరోనా వైరస్ కారణంగా ఈ సారి సౌదీ అరేబియాలో పరిమితంగా ‘హజ్’ నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కేవలం స్థానిక ప్రజలనే ఇందుకు అనుమతించనున్నారు. గత ఏడాది సుమారు ఇరవై అయిదు లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు సౌదీని సందర్శించారు. కానీ ఈ మారు కోవిడ్ ఎపిడమిక్ కారణంగా సుమారు వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తామని హజ్ వ్యవహారాల మంత్రి మహమ్మద్ బెంటెన్.. మీడియాకు తెలిపారు. నిజం చెప్పాలంటే వెయ్యిమందికన్నా ఇంకా తక్కువే అని కూడా ఆయన చెప్పారు. సౌదీలో ప్రస్తుతం 161,000 కరోనా వైరస్ కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటివరకు 1300 మంది కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఇంతగా ఈ వైరస్ ప్రబలమైనప్పటికీ ఈ దేశంలో ఈ నెల 21 నుంచి అన్ని వ్యాపార కూడళ్ల పైన, సినిమా హాళ్ల పైన గల ఆంక్షలను ఎత్తివేశారు. అటు-పరిమితంగా హజ్ యాత్రను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయం లక్షలాది ముస్లిములకు నిరాశ కల్గించింది. అయితే కరోనా వైరస్ భయం కూడా వారి వెన్నంటే ఉంది.