
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ కట్టడి కోసం నిరంతం శ్రమిస్తోన్న డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు, అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అక్కడా ఇక్కడ అనే తేడాలేకుండా అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు అందరినీ వైరస్ వెంటాడుతోంది. చిన్నాపెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా రాష్ట్రంలో చాలా మంది ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు.
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వైద్య సిబ్బందిని వెంటాడుతున్న కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది అనేక మంది కోవిడ్ బారినపడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అదే ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. గత మూడ్రోజులుగా హైఫీవర్‌తో సూపరింటెండెంట్ బాధపడుతుండగా..అతన్ని ప్రైమరీ కాంటాక్టుల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఇటు ఆస్పత్రి సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.