కేరళలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం

| Edited By:

Jul 15, 2020 | 12:38 AM

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఓ దశలో అక్కడ కరోనా మహమ్మారిని రాష్ట్రం జయిస్తుందనుకున్న వేళ.. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం..

కేరళలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు.. అప్రమత్తంగా ఉండాలన్న సీఎం
Follow us on

కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అన్‌లాక్‌ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఓ దశలో అక్కడ కరోనా మహమ్మారిని రాష్ట్రం జయిస్తుందనుకున్న వేళ.. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా మంగళవారం నాడు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేరళ సీఎం పినరయ్ విజయన్ తెలిపారు. ఒక్కరోజే 608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికమని తెలిపారు. మంగళవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,930కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,454 యాక్టివ్ కేసులు ఉన్నాయని సీఎం విజయన్ తెలిపారు.

కాగా, మంగళవారం నాడు నమోదైన కేసుల్లో అత్యధికంగా  తిరువనంతరపురం జిల్లాలో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం పినరయ్ విజయన్ అన్నారు. ఆ తర్వాత ఎర్నాకులం జిల్లాలో 70, మలప్పురం 58, కోజికోడ్‌ 58, కాసర్‌గోడ్‌44, తిరుసూర్ 42, అలప్పుజా 34, పాలక్కడ్ ‌26, కొట్టాయం 25, కొల్లాం 23, వయనాడ్ 12, కన్నూర్ జిల్లాలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మరో మూడు కేసులు పథనంతిట్టలో నమోదయ్యాయని తెలిపారు. కరోనా కట్టడి కోసం హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 227 కరోనా హాట్‌స్పాట్‌ జోన్‌లను గుర్తించారు.