ఏపీ రైతుల ఖాతాలో రూ.2వేలు.. మోదీకి థ్యాంక్స్ చెప్పిన కన్నా..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతాంగానికి ఆసరాగా నిలిచింది. కరోనా కష్టకాలంలో.. రైతులందర్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాలోకి.. రూ. 2వేల చోప్పున జమ చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. “కరోనా కష్టకాలంలో […]

ఏపీ రైతుల ఖాతాలో రూ.2వేలు.. మోదీకి థ్యాంక్స్ చెప్పిన కన్నా..

Edited By:

Updated on: Apr 14, 2020 | 8:07 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతాంగానికి ఆసరాగా నిలిచింది. కరోనా కష్టకాలంలో.. రైతులందర్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాలోకి.. రూ. 2వేల చోప్పున జమ చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్ రైతుల ఖాతాలోకి రూ.2000 చొప్పున జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆపన్నహస్తం ఇచ్చిన ప్రధాని మోదీ, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర రైతాంగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు.