కాణిపాకం క్షేత్రంలో క్వారంటైన్‌..! త‌ప్పుడు ప్ర‌చారంపై అధికారుల ఆగ్ర‌హం

|

Apr 07, 2020 | 1:19 PM

తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ వినని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వినాయకుడు స్వయంభువుగా వెలిసిన ప్రసిద్ద కాణిపాకం క్షేత్రంపై..

కాణిపాకం క్షేత్రంలో క్వారంటైన్‌..! త‌ప్పుడు ప్ర‌చారంపై అధికారుల ఆగ్ర‌హం
Follow us on
తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా ఎవరూ వినని పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా వినాయకుడు స్వయంభువుగా వెలిసిన ప్రసిద్ద కాణిపాకం క్షేత్రంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ర్ప‌చారం జరుగుతోంది. కాణిపాకం ఆలయాన్ని ఐసోలేషన్‌ వార్డుగా మార్చారని చేస్తున్న ప్రచారాన్ని ఆలయ అధికారులు తిప్పికొడుతున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దేవాలయం కాణిపాకం వినాయక స్వామి దేవాలయం కాదు. అది కాణిపాకంలో ఉన్న శ్రీ గణేష్ సదన్ అనే నివాస కేంద్రం. ఆ నివాస కేంద్రాన్ని క్వారంటైన్‌ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది. కావున వైరల్‌ అవుతున్న పోస్టు తప్పు అని ఇప్పటికే టీవీ9 కూడా ప్రచారం చేసింది. ఇటువంటి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న వారిని గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.