ఎయిమ్స్‌ బిల్డింగ్‌ నుంచి దూకిన కరోనా జర్నలిస్టు.. చికిత్స పొందుతూ మృతి..

| Edited By:

Jul 06, 2020 | 9:02 PM

కరోనా మహమ్మారి బారినపడ్డ వ్యక్తులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొన్న హర్యానాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే.. నిన్న హైదరాబాద్‌లో కరోనా సోకిందన్న..

ఎయిమ్స్‌ బిల్డింగ్‌ నుంచి దూకిన కరోనా జర్నలిస్టు.. చికిత్స పొందుతూ మృతి..
Follow us on

కరోనా మహమ్మారి బారినపడ్డ వ్యక్తులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మొన్న హర్యానాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే.. నిన్న హైదరాబాద్‌లో కరోనా సోకిందన్న అనుమానంతో ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరువక ముందే దేశ రాజధాని ఢిల్లీలో మరో సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్టు నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆయన్ను ఆస్పత్రిలోకి చేర్చారు. వెంటనే వైద్యులు ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ.. మృత్యువుతో పోరాడి మరణించాడు. అయితే కరోనా నుంచి కోలుకుని ఇవాళే.. జనరల్ వార్డుకు తరలించామని వైద్యులు తెలిపారు. అయితే ఉద్యోగ సంబంధిత విషయానికి సంబంధించిన ఒత్తిడి క్రమంలో ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, అంతకు ముందు వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కూడా కరోనా మహమ్మారి సోకిందని భయానికి గురై ఆత్మహత్యాయాత్నం చేశాడు. ఇక గత నెల జూన్ 19వ తేదీన హర్యానాలో ఓ వ్యక్తి కరోనా సోకిందన్న కారణంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలావుంటే దేశంలో కరోనా కేసులు ఏడు లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2.53 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడ్డ వారు 4.24 లక్షల మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య ఇరవై వేలకు చేరువలో ఉంది.