బ్రేకింగ్: జులై 31 వరకు ఇంటర్నేషనల్ విమానాలు రద్దు

| Edited By:

Jul 03, 2020 | 4:38 PM

కేంద్ర విమానయాన శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రితమే జులై 15వ తేదీ వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును జులై 31వ తేదీ వరకూ పెంచుతూ..

బ్రేకింగ్: జులై 31 వరకు ఇంటర్నేషనల్ విమానాలు రద్దు
Follow us on

కేంద్ర విమానయాన శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల క్రితమే జులై 15వ తేదీ వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ గడువును జులై 31వ తేదీ వరకూ పెంచుతూ ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ ప్రకటించింది. అప్పటివరకూ భారత్ ‌నుంచి ఇతర దేశాలకు, విదేశాల నుంచి భారత్‌కు ఎలాంటి విమాన ప్రయాణాలు ఉండబోవని స్పష్టం చేసింది. అయితే వందే భారత్ మిషన్ మాత్రం కొనసాగుతుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా మరోవైపు దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సాధారణ రైళ్ల సర్వీసులను ఆగష్టు 12వ తేదీ వరకూ రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇంటర్నేషనల్‌ ఫ్లైట్ సర్వీసులను కూడా రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ షరతులు అంతర్జాతీయ కార్గో విమానాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నడిపే విమానాలకు వర్తించవని పేర్కొంది కేంద్రం. ఇక అలాగే దేశీయ విమాన సర్వీసుల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని కేంద్రం వెల్లడించింది.

Read More:

ఇక తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు.. అరగంటలో రిజల్ట్..

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..