ఇక తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు.. అరగంటలో రిజల్ట్..

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఫ్రీగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇకపై కోవిడ్ టెస్టులను మరింత వేగం చేయనుంది. అయితే టెస్టుల రిపోర్ట్ వచ్చే సరికి మరింత ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఓ సంచలన నిర్ణయం..

ఇక తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు.. అరగంటలో రిజల్ట్..
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2020 | 3:55 PM

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే కరోనాను కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం అస్సలు తగ్గడం లేదు. రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో 70 నుంచి 80 శాతం వరకూ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్యులు, నటులు సైతం ఈ వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఫ్రీగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇకపై కోవిడ్ టెస్టులను మరింత వేగం చేయనుంది. అయితే టెస్టుల రిపోర్ట్ వచ్చే సరికి మరింత ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లో కోవిడ్ ఉందా? లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఉపయోగించే ‘ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్’ ద్వారా పరీక్షలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ‘ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్’ ద్వారా పరీక్షలు చేస్తే గరిష్టంగా అరగంటలో ఫలితం రానుంది. దీనికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మరో 2, 3 రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు తెలంగాణకి రానున్నాయి.

కాగా ముఖ్యంగా ఈ పరీక్షలను కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే చేస్తారు. అందులోనూ 65 ఏళ్ల పై బడిన వారు, జ్వరం, దగ్గు, శ్వాస కోవ ఇబ్బందులు, జలుబు ఉన్నవారికి దీని ద్వారా పరీక్షించాలని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే కంటైన్మెంట్‌ జోన్లలో ఉన్నవారికి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధి, కాలేయ, మూత్ర పిండాల వ్యాధి, షుగర్, బీపీ తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి కూడా ఈ పరీక్షలను చేస్తారు.

Read More:

బ్రహ్మీ షాకింగ్ డెసిషన్.. సీరియల్స్‌లోకి ఎంట్రీ?

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సీఎం జగన్ వరం..

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..