అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఈ నెల 8 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఆదివారం సాయంత్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలను ఆదివారం జారీ చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మొదటి 7 రోజులు వారి సొంత ఖర్చులతో.. కేంద్రం నిర్దేశించిన క్వారంటైన్ కేంద్రంలో, తదుపరి వారం రోజులు క్వారంటైనర్‌లో ఉండాలని పేర్కొంది.
ఈ మేరకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని న్యూఢిల్లీ ఎయిర్ పోర్టు. ఇన్ వెబ్‌సైట్‌లో ప్రయాణానికి 72 గంటల ముందుగా సమర్పించాలని పేర్కొంది. ఇక గర్భిణిలు, పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులు, వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి 14 రోజుల హోమ్ క్వారంటైన్‌కు అనుమతిస్తామని తెలిపారు. అలాగే కరోనా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More:
కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్
వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్.. 138 కొత్త ఎమోజీలు..
‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!