‘ఆపరేషన్‌ సముద్ర సేతు’లో 700 మంది భారతీయులు

|

Jun 01, 2020 | 12:46 PM

విదేశాల్లోచిక్కున్న భారతీయులకు స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలను నుంచి ఇప్పటికే చాలా మందిని తీసుకొచ్చింది. భారత నౌకాదళం. తాజాగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఐఎన్‌ఎస్‌ జలాశ్వా సిద్ధమయ్యింది. ఈ సాయంత్రం దాదాపు 700 మంది భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి […]

‘ఆపరేషన్‌ సముద్ర సేతు’లో 700 మంది భారతీయులు
Follow us on

విదేశాల్లోచిక్కున్న భారతీయులకు స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. సముద్రమార్గంలో స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నౌకాదళం ‘ఆపరేషన్‌ సముద్ర సేతు’ చేపట్టి వేల సంఖ్యలో భారతీయులను తరలిస్తోంది. ఇందులో భాగంగా భారత్‌కు సమీపంలో ఉన్న ప్రాంతాలను నుంచి ఇప్పటికే చాలా మందిని తీసుకొచ్చింది. భారత నౌకాదళం. తాజాగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఐఎన్‌ఎస్‌ జలాశ్వా సిద్ధమయ్యింది. ఈ సాయంత్రం దాదాపు 700 మంది భారతీయులతో కొలంబో నుంచి తమిళనాడులోని ట్యూటికోరిన్‌కు బయలుదేరనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే నౌకలోకి ఎక్కించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.