
ఒకవైపు ప్రపంచమంతా కరోనాపై యుద్ధం చేస్తుంటే.. మృగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వస్తున్నా, నిందితులను ఎంతో కఠినంగా శిక్షిస్తున్నా.. వారిలో మార్పులు రావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మృగాలు రెచ్చిపోతున్నారు. కరోనా వ్యాప్తి చేయకుండా లాక్‌డౌన్ విధిస్తే.. కీచకులకు మాత్రం అదే వరంలా మారుతోంది. ఆఖరికి క్వారంటైన్‌లో ఉన్న మహిళలను కూడా వదలడం లేదు. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్‌లో జరిగింది. గత గురువారం రాత్రి ఈ ఘటన జరుగగా.. ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌కు చెందిన ఓ మహిళ లాక్‌డౌన్ కారణంగా మాధోపూర్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. నెల రోజులు అయినా లాక్‌డౌన్ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమి లేక కాలినడకన సొంతూరుకు బయలు దేరింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె మాధోపూర్‌కు చేరుకోగా.. స్థానికులు అడ్డుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు అర్థరాత్రి పాఠశాలకు చేరుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read More:
లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ
మళ్లీ లాక్‌డౌన్ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్
అన్నీ తెలిసే వెళ్లాడు.. తనకి నేనేం సలహాలు ఇస్తాను? పవన్‌పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్