రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం.. బుకింగ్ టికెట్ల రద్దుపై కొత్త మార్గదర్శకాలు..

|

May 14, 2020 | 2:30 PM

కేంద్ర రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ టికెట్ల రద్దు, డబ్బు రీఫండ్‌పై తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాన్సిల్ అయిన ట్రైన్స్‌కు పీఎస్ఆర్ కౌంటర్‌కు అనుగుణంగా డబ్బుల రీఫండ్‌ను కౌంటర్ ద్వారా ఆరు నెలలులోపు తీసుకోవచ్చు. ఇక ఈ- టికెట్‌కు అయితే రీఫండ్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. అదేవిధంగా ట్రైన్స్ క్యాన్సిల్ కాకుండా.. ప్రయాణీకుడు టికెట్‌ను రద్దు చేసుకునప్పుడు పీఎస్ఆర్ కౌంటర్ నుంచి టికెట్ డబ్బులు వెనక్కి పొందాలంటే ప్యాసింజర్లు టీడీఆర్ ఫైల్ చేయాల్సి […]

రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం.. బుకింగ్ టికెట్ల రద్దుపై కొత్త మార్గదర్శకాలు..
Follow us on

కేంద్ర రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుకింగ్ టికెట్ల రద్దు, డబ్బు రీఫండ్‌పై తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాన్సిల్ అయిన ట్రైన్స్‌కు పీఎస్ఆర్ కౌంటర్‌కు అనుగుణంగా డబ్బుల రీఫండ్‌ను కౌంటర్ ద్వారా ఆరు నెలలులోపు తీసుకోవచ్చు. ఇక ఈ- టికెట్‌కు అయితే రీఫండ్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది.

అదేవిధంగా ట్రైన్స్ క్యాన్సిల్ కాకుండా.. ప్రయాణీకుడు టికెట్‌ను రద్దు చేసుకునప్పుడు పీఎస్ఆర్ కౌంటర్ నుంచి టికెట్ డబ్బులు వెనక్కి పొందాలంటే ప్యాసింజర్లు టీడీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుందని, ఈ టీడీఆర్‌ను వచ్చే 60 రోజుల్లోగా రైల్వే అధికారులకు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే ప్యాసింజర్లు 139కి కాల్ చేసి కూడా పీఎస్ఆర్ టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉందని తెలియజేసింది. కాగా, మార్చి 21 నుంచి జర్నీ ప్లాన్ చేసుకున్నవారికి ఈ రూల్స్ వర్తిస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.

Read This: జూన్ 30 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు రద్దు..