Covid-19 Second Wave: వైద్యరంగంపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 719 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో..

|

Jun 12, 2021 | 12:31 PM

Doctors - Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలు చేరువలో కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో

Covid-19 Second Wave: వైద్యరంగంపై కరోనా పంజా.. సెకండ్ వేవ్‌లో 719 మంది మృతి.. తెలుగు రాష్ట్రాల్లో..
Doctors
Follow us on

Doctors – Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలు చేరువలో కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో కోవిడ్ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) శనివారం వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 111 మంది వైద్యులు కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఢిల్లీలో 109 మంది, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్‌లో 63 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది, గుజరాత్‌లో 37, తెలంగాణలో 36 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35 మంది తమిళనాడులో 32 మంది మృతి చెందారని ఐఎంఏ తెలిపింది. కాగా.. కరోనా మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. గత 24 గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. నిన్న కరోనా బారిన పడి 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 3,67,081కి చేరుకుంది. కాగా.. ప్రస్తుతం 10,80,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కరోనా నుంచి 1,21,311 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రికవరీల సంఖ్య 2,79,11,384కి చేరింది.

Also Read:

Aviptadil: కరోనా చికిత్సకు మరో హైదరాబాద్ ఔషధం.. ‘అవిప్టాడిల్’ అత్యవసర అనుమతికి బయోఫోర్ దరఖాస్తు

Leopard Hunts Dog: ఇంటి బయట పడుకున్న కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. షాకింగ్ వీడియో..

మీ ఫోన్ వర్షంలో తడిసిపోయిందా ? అయితే ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి.. చాలా డేంజర్..