India Coronavirus: భారత్‌‌లో కరోనా అల్లకల్లోలం.. ప్రపంచంలో తొలిసారిగా.. 4 లక్షలకు పైగా కేసులు..

|

May 01, 2021 | 9:53 AM

Covid-19 updates in India: దేశంలో కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో

India Coronavirus: భారత్‌‌లో కరోనా అల్లకల్లోలం.. ప్రపంచంలో తొలిసారిగా.. 4 లక్షలకు పైగా కేసులు..
Coronavirus In India
Follow us on

Covid-19 updates in India: దేశంలో కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రపంచంలో తొలిసారిగా.. భారత్‌లో నిన్న రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు రికార్డు స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో శుక్రవారం.. 4,01,993 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 3,523 మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969 (1.91 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,11,853 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభమైన నాటినుంచి.. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. శుక్రవారం కరోనా నుంచి 2,99,988 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,56,84,406 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 32,68,710 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 81.84 శాతం ఉండగా.. మరణాల రేటు 1.11 శాతం ఉంది. కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 19,45,299 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 30 వరకు మొత్తం 28,83,37,385 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 15,49,89,635 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాగా.. నేటి నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

 

Also Read:

Covid19 Vaccine: కరోనా కట్టడికి మరో వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి.. వ్యాక్సిన్ జాబితాలో “మోడెర్నా” కు చోటు

International Labour Day 2021: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.. మే డే.. ఎందుకు జరుపుకుంటారు.. చరిత్ర ఎంటో తెలుసుకుందామా….