India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. భారీగా కేసులు, మరణాలు నమోదు..

|

Apr 27, 2021 | 9:52 AM

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో

India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. భారీగా కేసులు, మరణాలు నమోదు..
India Coronavirus
Follow us on

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మరణాలతో అంతటా భయాందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా లక్షల్లో కోవిడ్-19 కేసులు నమోదవుతుండగా.. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. రోజురోజూకు వీటి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో సోమవారం దేశవ్యాప్తంగా 3,23,144 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 2771 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,76,36,307 (1.76 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 1,97,894 కి చేరింది. ఈ మేరకు మంగళవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. నిన్నటితో పోల్చుకుంటే.. కరోనా కేసులు, మరణాల సంఖ్య కొంతమేర తగ్గింది.

ఇదిలాఉంటే.. సోమవారం కరోనా నుంచి 2,51,827 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,45,56,209 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 28,82,204 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. ఆదివారం దేశవ్యాప్తంగా 16,58,700 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 26 వరకు మొత్తం 28,09,79,877 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ వెల్లడించింది. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 14,52,71,186 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Also Read:

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..

NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎన్వీ రమణ