చైనా, దక్షిణ కొరియాతో పాటు యూరప్ దేశాల్లో కరోనా (Corona) విజృంభిస్తోన్నా మన దేశంలో మాత్రం ఈ మహమ్మారి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గుతున్నాయి. వరుసగా రెండో రోజూ కూడా 2వేలకు పైగా దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) సోమవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం .. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 3.84లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 1,549 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 0.40శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో 2,652 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 98.74శాతానికి ఎగబాకింది. ఇక నిన్న మొత్తం దేశవ్యాప్తంగా 31 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 5.16 లక్షలకు చేరుకుంది.
181 కోట్లు దాటిన టీకాల పంపిణీ..
ప్రస్తుతం దేశంలో 25,106 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. క్రియాశీల రేటు 0.06శాతానికి దిగొచ్చింది. కాగా ఫోర్త్ వేవ్ ఊహగానాల నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మరో 2.97లక్షల మందికి టీకా అందించారు. దీంతో ఇప్పటివరకు 181.24కోట్ల కరోనా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా మార్చి 16 నుంచి 12-14 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ వయసు వారిలో 17.99 లక్షల మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.
#Unite2FightCorona#LargestVaccineDrive
????? ?????https://t.co/D6N5Zcb2QT pic.twitter.com/4AO75wV4Ak
— Ministry of Health (@MoHFW_INDIA) March 21, 2022
Also Read:Crime news: ఈత కొట్టేందుకు నీటిలో దిగారు.. ఊబిలో చిక్కుకుని మునిగిపోయారు.. విషాదం నింపిన సరదా
IT Alert: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ విషయాలు పూర్తి చేశారా.. వెంటనే కంప్లీట్ చేయండి..
Sound Pollution: నగరంపై ఉరుముతున్న శబ్ద మేఘాలు.. సౌండ్ పొల్యూషన్ తో ఉక్కిరిబిక్కిరి