ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఫైనల్‌ ఫేస్‌.. భారత్‌లో 5చోట్ల ప్రయోగం..

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్టాజెన్‌కా కరోనా వ్యాక్సిన్‌ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఫైనల్‌ స్టేజ్‌ (మూడో దశ) ట్రయల్స్‌ మన దేశంలో కూడా నిర్వహించనున్నారు. మొత్తం ఐదు చోట్ల..

ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఫైనల్‌ ఫేస్‌.. భారత్‌లో 5చోట్ల ప్రయోగం..

Edited By:

Updated on: Jul 28, 2020 | 9:27 AM

ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఆస్టాజెన్‌కా కరోనా వ్యాక్సిన్‌ ఫైనల్‌ ట్రయల్స్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఈ ఫైనల్‌ స్టేజ్‌ (మూడో దశ) ట్రయల్స్‌ మన దేశంలో కూడా నిర్వహించనున్నారు. మొత్తం ఐదు చోట్ల ఈ ట్రయల్స్‌ చేపట్టనున్నారు.బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ రేణూ స్వ‌రూప్ ఈ విష‌యాన్ని తెలిపారు. మన దేశంలో ఈ ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్టాజెన్‌కా టీకాను ఉపయోగంలోకి తీసుకురావడానికి ముందు.. వ్యాక్సిన్‌ను ఇక్కడే ప‌రీక్షించ‌డం అత్యంత ముఖ్య‌మైన విష‌య‌మ‌ని అన్నారు. మన దేశానికి చెందిన సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఈ వ్యాక్సిన్‌
తయారు చేయనుంది. తొలి రెండు హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్‌కు చెందిన రిపోర్టులను ఇప్పటికే విడుదల చేశారు.

ఇక భార‌త్‌లో ఎలాంటి కరోనా వ్యాక్సిన్‌ టెస్టులు జరిగినా.. అందులో డీబీటీ భాగస్వామ్యం ఉంటుందని బయోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్ సెక్ర‌ట‌రీ తెలిపారు. నిధులు, రెగ్యులేట‌రీ క్లియ‌రెన్సులు, విభిన్న నెట్వ‌ర్క్‌ల‌కు అనుమ‌తి ఇవ్వడం వంటి అంశాలన్నీ బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌కు చెందుతాయన్నారు. ఆక్స్‌ఫ‌ర్డ్ ఫైనల్‌ స్టేజ్‌ క్లినికల్ ట్రయల్స్‌కు సైట్ల‌ను సిద్ధం చేసే పనిలో డీబీటీ ఉన్నట్లు స్వరూప్‌ తెలిపారు. ఇప్పుడు ఐదు చోట్ల ఈ క్లినికల్ ట్రయల్స్‌ చేసేందుకు అంతా సిద్ధమైందన్నారు.